ఆపిల్ కంపెనీ లోగో సగం కొరికిన ఆపిల్ లాగా ఎందుకుంటుందంటే, ఆపిల్ మరియు చెర్రీ పండ్లు ఇంచుమించు చూడటానికి ఒకే విధంగా ఉంటాయి. ఈ లోగో చూసేవాళ్లకు ఇది ఆపిల్ లేదా చెర్రినా అనే అనుమానం ఉండకూడదు అనే ఉద్దేశంతో లోగో డిజైనర్ అయిన రాబ్ జనోఫ్ లోగోని ఈ విధంగా రూపొందించారు.
ప్రజలందరికీ వీలైనంత స్మార్ట్ సైజులో ఆపిల్ ప్రొడక్ట్స్ ను అందించాలని స్టీవ్ జాబ్స్ యొక్క ఆలోచన. ఇదే ఆలోచనని తన దగ్గర పనిచేసే ఇంజనీర్లుకి తెలిపాడు. వీలైనంత చిన్న సైజులో ఆపిల్ ఐపాడ్ లను తయారు చేసుకొని రమ్మని తన ఇంజనీర్లకు తెలిపాడు.తాను చెప్పిన విధంగానే చాలా చిన్న ఐపాడ్ లను తయారు చేసుకొని వచ్చారు. స్టీవ్ జాబ్స్ వాటిని తీసుకొని అక్కడ ఉన్న ఒక అక్వేరియంలో పడేసాడు.అప్పుడు అక్వేరియంలో ఉన్న ఐపాడ్ నుంచి కొన్ని బుడగలు కనిపించాయి.స్టీవ్ జాబ్స్ తన ఇంజనీర్లతో ఇలా అన్నాడు దీనిలో బబుల్స్ (నీటిబుడగలు) మనకు కనిపిస్తున్నాయంటే దీనిలో ఇంకా గ్యాప్ ఉన్నట్లే , ఈ గ్యాప్ ను కూడా తీసేయగలిగితే ఇంకా చిన్న సైజులో మన ప్రోడక్ట్స్ ను ప్రజలకు అందించవచ్చు అని చెప్పారు. దీని యొక్క రిజిల్ట్ మనం ఇప్పుడు చూస్తున్న ఆపిల్ ప్రోడక్ట్స్.
ఆపిల్ ఫోన్లలో చాలా మంది గమనించారో లేదో దానిలో సమయం ఎప్పుడు 9:41 am గా కనిపిస్తూఉంటుంది. దీనికి గల కారణం స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి ఐఫోన్ ను ఆవిష్కరించిన సమయం జూన్ 29, 2007 వ సంవత్సరంలో 9:41am కి మొట్టమొదటి ఈ ఫోన్ ను ఆవిష్కరించి న కారణంగా దానికి గుర్తుగా అదే సమయం ఉండాలనేది స్టీవ్ జాబ్స్ గారి కోరిక.
ప్రపంచములో ఒక గంట సమయంలో అమ్ముడవుతున్న ఆపిల్ ఫోన్ల సంఖ్య సుమారు 35,393 అంటే ఇంచుమించుగా నిమిషానికి 590 ఫోన్లు సేల్ చేస్తున్నారు.
ఆపిల్ ఐపాడ్ యొక్క రెటీనా డిస్ప్లే ను దాని కాప్టిటర్ అయిన sumsung కంపెనీ సప్లై చేస్తుంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐఫోన్ 5 యొక్క విలువ 15 మిలియన్ డాలర్లు అంటే భారత రూపాయిలో చెప్పాలంటే 1సుమారు 106 కోట్లు. దీని ప్రత్యేకత ఏమిటంటే 135 గ్రాముల 24 క్యారెట్ బంగారాన్ని మరియు దీని చుట్టూ ఫీనిషింగ్ కోసం 600 వైట్ డైమండను ఉపయోగించారు. ఈ విధంగా ఈ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐ ఫోనుగా రికార్డ్ సాధించింది.
ఆపిల్ వంటి పెద్ద సంస్థలో ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయనేది అందరికి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటుంది. ఒక సర్వే యొక్క నివేదిక ప్రకారం ఆపిల్ సంస్థలోని ప్రధాన కార్యాలయంలో సగటు ఉద్యోగి జీతం సంవత్సరానికి 9 కోట్లు, అంటే రోజుకి 2,46,575 రూపాయలు, అంటే గంటకు 30,821 రూపాయలు అన్నమాట.
ఆపిల్ కంపెనీ యొక్క హెర్డ్ కోటస్ యునైటెడ్ స్టేట్ లోని కాలిఫోర్నియాలో ఉంది.