నల్లమల అడవి రహస్యాలు – Nallamala forest secrets

నల్లమల అడవి రహస్యాలు – Nallamala forest secrets

  • నల్లమల అడవులు ఆంద్రప్రదేశ్ లోని 5 జిల్లాలలో (కర్నూల్,మహబాబునగర్ ,ప్రకాశం,గుంటూరు) విస్తరించిఉన్నాయి. 
  • పెన్నా నది మరియు కృష్ణా నదులకు మధ్యన ఉత్తర-దక్షిణ దిశగా దాదాపు 150 కి.మీ. వరకు విస్తరించి ఉన్నాయి. 
  • నల్లమల మధ్యభాగంలో ఉన్న దట్టమైన  అటవీ ప్రాంతంలో  పులుల అభయారణ్యం ఉంది. దీనిని పులులను సంరక్షించడం కోసం ఏర్పాటు చేశారు. భారత దేశంలోని 19 పులుల సంరక్షణ కేంద్రాలలో ఇది ఒకటి. 
  • ఈ అడవుల్లో పడిన వర్షపు నీరు మొత్తం గుండ్లకమ్మ నదిలో కలుస్తాయి. 
  • నల్లమల  అడవులను నల్లమల కోడలు అని కూడా పిలుస్తారు. ఈ అడవి మొత్తం కొండలతో నిండి ఉంటుంది. 
  • నల్లమల అడవి ప్రాంతంలో ఆటవిక తెగలు చెంచులు ఇప్పటికి నివసిస్తున్నారు. 
  • ఈ అడవి మధ్యభాగంలో రైలు మార్గం కూడా ఉన్నది. గుంటూరు – గుంతకల్లు రైలు ప్రయాణం చేసేవారు నల్లమల అడవిని చూడవచ్చు. 
  • నల్లమల అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా కొండలు, లోయలు, ఎత్తైన చెట్లు ఉంటాయి. ఈ అడవిలో పులులు ఎక్కువగా తిరుగుతుంటాయి. 
  • ఈ అడవుల్లో బైరాని కొండ, గుండ్ల బ్రహ్మయేశ్వరం ఉన్నాయి. వీటిని చేరుకోవాలంటే చాలా ప్రమాదకరమైన అడవి మధ్యలో ప్రయాణించాల్సి వస్తుంది. 
  • నల్లమల అడవుల్లో వజ్రాలు మరియు పురాతన సంపద చాలా వరకు దాగిఉన్నాయనే ప్రచారం ప్రాచుర్యంలో ఉంది. అనేక జిల్లాల నుంచి ప్రజలు వజ్రాల వేట కోసం ఇక్కడికి వస్తుంటారు. 
  • శ్రీశైలం ప్రాజెక్టు, గుండ్ల బ్రహ్మయేశ్వర శిఖర జలపాతం, నెమలి గుండం, ఓంకారం, మహానంది, రుద్రకోడూర్, పావురాలగుట్ట వంటివి నల్లమల అటవీ ప్రాంతం దగ్గరలో  చూడదగ్గ ప్రదేశాలు.
  • ఆత్మకూరు నుండి నంద్యాలకు వెళ్లే మార్గంలో నల్లకాలువ గ్రామానికి సమీపంలో వైఎస్ఆర్  స్మృతివనాన్ని ఏర్పాటుచేయడం జరిగింది. ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
  • భయంకరమైన విషయం ఏమిటంటే చాలా మంది మూఢనమ్మకాలను నమ్మే వారు గుప్త నిధుల కోసం ఈ అడవుల్లో నరబలి చేస్తుంటారు. మనుషులను నరబలి చేసిన ప్రదేశేషాలలో ఆనవాళ్లు చాలా వరకు కనిపించాయి. 
  • నల్లమల అడవుల్లో అన్వేషణ చేసి  యురేనియం ఉన్నట్లు అధికారులు  కనుగొన్నారు. దీనిని వెలికి తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల అక్కడి జంతు,జీవ జాతులకు చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంది. 

నల్లమల అడవుల్లోని రైలు మార్గం 

అహోబిలం నల్లమల అడవులు 

శ్రీశైలం ప్రాజెక్ట్ 

 

పులుల సంరక్షణా కేంద్రం 

నల్లమల అటవీ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలు 

  1. కొన్ని సంవత్సరాల క్రితం శివస్వాములు శ్రీశైలం వస్తూ ఈ అడవుల్లో దారి తప్పిపోయారు. అప్పటి ప్రభుత్వం వీరిని హెలికాఫ్టర్ ద్వారా గాలించి జాడను కనుగొన్నారు. 
  2. 2009 సంవత్సరంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా వైస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఈ అటవీ ప్రాంతంలోనే కూలిపోయింది. సెప్టెంబర్ 2, 2009 ఉదయం మరణించడం జరిగింది. దీంతో ముఖ్యమంత్రి మరణించిన పావురాల గుట్ట ప్రాచుర్యంలోకి వచ్చింది. ‘ 
  3. గుప్త నిధుల కోసం అడవుల్లోకి బయలుదేరిన చాలా మంది వ్యక్తులు ఇప్పటికి ప్రాణాలతో తిరిగి రాలేదు. 
  4. అడవి దగ్గరలో నివసించే ప్రజలు అప్పుడప్పుడు కట్టెల కోసం ఈ అడవుల్లోకి వెళ్తుంటారు. ఇలా వెళ్లిన వాళ్ళల్లో కొంతమంది క్రూర మృగాలకు బలైపోయినారు. 

 telugudiscovery.com

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *