ప్రపంచంలో మనకు తెలియని అప్పటి రాజుల కాలం నాటి నిధులు ఇప్పటికి చాలా ప్రదేశాల్లో దాగివున్నాయి. ఇప్పుడు మనం ఖచ్చితంగా నిధులు ఉన్నాయని తెలిపే కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
1. నదీర్ షా నిధి
నదీర్ షా అనే పర్షియన్ రాజు మన భారతదేశానికి 1739 వ సంవత్సరంలో 50,000 మంది సైన్యంతో వచ్చి సుమారు అనేక మందిని హతమార్చి టన్నుల కొద్దీ బంగారాన్ని,వజ్రాలను దోచుకున్నాడు. వీటినన్నిటిని తాను ఏర్పాటు చేసుకున్న అతిపెద్ద భారీవాహనాలలో తన దేశానికీ తరలిస్తుండగా దారి మధ్యలో అహ్మద్ షా అనే రాజు నదీర్ షా ను చంపి అక్కడి నిధి మొత్తాన్ని దక్కించుకున్నాడు. ఆ తరువాత ఈ నిధి మొత్తాన్ని హిందూకుష్ పర్వతాల మధ్యలో దాచి ఉంచాడు. ఆ తరువాత కొన్నిసంవత్సరాల తరువాత అనారోగ్యం కారణంగా చనిపోయాడు. అప్పటినుంచి ఆ నిధి పర్వతాల మధ్యలో అక్కడే ఉండిపోయింది. ఇప్పటికి ఈ నిధి ఎవ్వరికీ దొరకలేదు.
2. అనంత పద్మనాభ స్వామి ఆలయ నిధి
కేరళలోని తిరువనంతపురంలో అనంతపద్మనాభస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని భూగర్భాల్లో ఆరు గదులున్నాయి. వీటిలో రెండు గదులను కొన్ని వందల సంవత్సరాల నుంచి తెరవలేదు. 2011 వ సంవత్సరంలో ఒక గదిని తెరిచారు. అందులో ఉన్న నిధిని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఆ గదిలో సుమారు 1,40,000 కోట్లు విలువచేసే నిధి దొరికింది. రెండవ గది మాత్రం ఇప్పటివరకు తెరవలేదు. ఈ గదిలో కొన్నికోట్ల విలువచేసే రెట్టింపు నిధులుంటాయని భావిస్తున్నారు.
3. చార్మినార్ సొరంగ మార్గం
చార్మినార్ నుంచి గోల్కొండ వరకు సొరంగ మార్గం ఉంది. ఈ సొరంగ మార్గాన్ని కుతుబ్ షా కట్టించి ఉంటారని భావిస్తున్నారు. శత్రువుల నుండి అత్యవసర సమయంలో బయట పడటానికి ఈ సొరంగ మార్గం ఉపయోగపడుతుంది. ఈ సొరంగంలో ఉన్న అనేక గదుల్లో నిధులున్నాయని చాలా మంది భావిస్తున్నారు.
4. గ్రోస్వెనోర్ షిప్ (Grosvenor Ship)
బ్రిటీష్ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఈ నౌకలో భారీ నిధి (బంగారం మరియు వజ్రాలు) చెన్నై(మద్రాసు) నుండి ఇంగ్లాండ్ వరకు తీసుకువెళ్ళేటప్పుడు మార్గమద్యమంలో సౌత్ ఆఫ్రికా వద్ద కనిపించకుండా పోయింది. కొన్ని సంవత్సరాల తరువాత ఈ నౌక యొక్క కొన్ని శిథిలాలను కనుగొన్నారు. కానీ దీనిలొ కొద్ది బంగారం మాత్రమే దొరికింది. మిగతా బంగారం ఇప్పటి వరకు దొరకలేదు.
5. మీర్ ఉస్మాన్ అలీ నిధి రహస్యం
మీర్ఉస్మాన్అలీ చివరిగా హైద్రాబాదును పరిపాలించిన నిజాం చక్రవర్తి. ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన వ్యక్తిగా టైం మ్యాగజైన్ పుస్తకంలో 1937 లో ప్రచురించబడింది. ఇతను సంపాదించిన సంపద మొత్తాన్ని తాను నిర్మించుకున్న అతి సుందరమైన కోటి ప్యాలస్ లో అంతర్భాగంలో ఉన్న రహస్యపు గదులలో భద్రపరచుకున్నాడు. ఈ కోటి ప్యాలస్ హైద్రాబాద్లో ఉంది. ఇతనికి బంగారు ఆభరణాలంటే చాలా ఇష్టం ఉండటంతో వాటినన్నిటిని సేకరించి ఈ ప్యాలెస్ లోనే భద్రపరిచేవాడు. ఇతను భద్రపరిచిన వాటిలో ముఖ్యంగా వజ్రాలు,బంగారునాణేలు ,బంగారు కడ్డీలు వంటివి చాలా ఉన్నాయి. మీర్ఉస్మాన్అలీ మరణించిన తరువాత ఈ సంపద ఏమైందో ఇప్పటికి తెలీదు. ఇతను కోటి ప్యాలెస్ లో ఎక్కువ కాలం గడిపిన కారణంగా ఆ నిధి మొత్తం అక్కడే ఉంటుందని భావిస్తున్నారు.

