మెదడు గురించి మీకు తెలియని 25విషయాలు – 25 Things You Didn’t Know About the Brain

మెదడు గురించి మీకు తెలియని 25విషయాలు – 25 Things You Didn’t Know About the Brain

  1. మనిషికి సుమారు ఒక రోజులో 70,000 వరకు ఆలోచనలు వస్తుంటాయి. 
  2. మనం తినే చాకొలేట్ వాసన మనం గ్రహించినట్లైతే మన మెదడులో ఒకరకమైన తరంగాలు రిలీస్ అవుతాయి. దీని వలన మెదడు  రిలాక్స్ గా  ఫీల్ అవుతుంది. 
  3. మనిషి శరీరంలోని మెదడు సుమారు 40 సంవత్సరాలు వచ్చే వరకు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. 
  4. నిద్రపోయేటప్పుడు సెల్ ఫోన్స్ పక్కన పెట్టుకున్నట్లైతే మనం రేడియేషన్ కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రాత్రి నిద్రపోయేటప్పుడు మన మొబైల్స్ ని  మనకు కాస్త దూరంగా ఉంచి పడుకోవాలి. 
  5. మనం ఆల్కహాల్ తీసుకునేటప్పుడు 5 నుంచి 10 నిమిషాల వరకు మత్తు అనేది కలగదు. ఎందుకంటే ఆల్కహాల్ మనం తీసుకున్నప్పుడు మన మెదడు మత్తు ప్రభావానికి గురవడానికి 5-10 నిమిషాల సమయం తీసుకుంటుంది. 
  6. అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు యొక్క శరీరంలోని గ్లూకోస్ ని  50% వరకు మెదడు ఉపయోగించుకుంటుంది. అందుకే చిన్న పిల్లలు ఎక్కువసేపు నిద్రపోతుంటారు. 
  7. మనం చిన్నపుడు 1-2 సంవత్సరాలు ఉన్నపుడు మనకు అప్పుడు జరిగిన విషయాలు గుర్తుకురాకపోవడానికి కారణం అప్పుడు మన మెదడు అభివృద్ధి చెందకపోవడమే కారణం. 
  8. మన కంటిపై కాంతి పడినపుడు మన మెదడు ఆ వెలుతురుని రిజిస్టర్ చేసుకోవడానికి సుమారు 0.2 సెకన్లు పడుతుంది.  
  9. మానవుని యొక్క మెదడులో సుమారు 78% నీరు ఉంటుంది. 
  10. శరీరం ఉపయోగించే మొత్తం ఆక్సిజన్ లో మెదడుకు 25% అవసరం ఉంటుంది.
  11. మానవుని మెదడు యొక్క బరువు 3 పౌండ్లు (1,300-1,400 గ్రా)
  12. 105 డిగ్రీల ఫారెనహీట్ అంతర్గత ఉష్ణోగ్రత వద్ద మన మెదడు దెబ్బతింటుంది.
  13. ఆక్టోపస్ మెదడులో సగటున 300 బిలియన్ న్యూరాన్లు ఉన్నాయి. 
  14. చీమ యొక్క మెదడులో 250,000 మెదడు కణాలు ఉన్నాయి.     
  15. మనిషికి 5-10 నిమిషాలు ఆక్సిజన్ అందకపోతే మెదడు శాశ్వతంగా దెబ్బ తింటుంది. 
  16. శాస్త్రవేత్తలు బొద్దింకలు యొక్క మెదడుపై శస్త్రచికిత్స చేశారు. 
  17. జెల్లీఫిష్ లకు మెదడు అనేది ఉండదు. కానీ అవి చీకటిని,కాంతిని గుర్తించగలవు. 
  18. మనిషి యొక్క మెదడు 18 సంవత్సరాల వయసులో పెరగడం ఆగిపోతుంది. 
  19. ఏనుగు మెదడు యొక్క బరువు సుమారు 6,000 గ్రా ఉంటుంది. 
  20. మానవ మెదడు సుమారు 100 బిలియన్ న్యూరాన్లు మరియు ఒక ట్రిలియన్ గ్లియల్ కణాలతో కూడి ఉంటుంది.
  21. ఉష్ణ పక్షి యొక్క కన్ను దాని మెదడు కంటే పెద్దదిగా ఉంటుంది. 
  22. మెదడు శక్తిని పెంచడానికి 1886 లో కోకా కోలాను “మేధోపానీయంగా”  ప్రవేశపెట్టారని మీకు తెలుసా?
  23. పిల్లి మెదడు యొక్క బరువు 30 గ్రాములు ఉంటుంది. 
  24. బియ్యం మరియు కొన్ని ఇతర ధాన్యాలు మనిషి యొక్క మెదడు పనితీరును పెంచే రసాయనాలను కలిగి ఉంటాయి. 
  25. డైట్ సోడా అనేది మెదడు యొక్క కణాలను చంపేస్తుంది. దీనిలో డైట్ గా ఉండటానికి చాలా రకాలైన రసాయనాలను ఉపయోగిస్తారు. 


 ప్రపంచంలో మనకు తెలియని వింతలు, విషయాలు, రహస్యాలు దాగి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే telugudiscovery.com అనుసరించండి. 

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *