విజయనగరరాజులు
విజయనగరరాజులు పరిపాలించిన చంద్రగిరికోట రహస్యాలు

Mysteries of Chandragiri Fort విజయనగరరాజులు పరిపాలించిన చంద్రగిరికోట రహస్యాలు –

విజయనగరరాజులు పరిపాలించిన చంద్రగిరికోట రహస్యాలు…

 

telugudiscovery.com
చంద్రగిరి కోట
 
విజయనగర రాజుల చరిత్రలో చంద్రగిరి ఒక  ప్రముఖ స్ఠానం వహించింది.

అర్ద చంద్రాకారంలో  ఉండే కొండ క్రింది భాగంలో దీనిని నిర్మించడం వల్ల  దీనికి చంద్రగిరి కోట అనే పేరు వచ్చింది.  ఈ కోట నిర్మాణంలో వాడిన సాంకేతికత ఇప్పటి అత్యాధునిక ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఏమాత్రం తీసిపోకుండా  ఉండడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం. అప్పటికాలంలో ఇక్కడ రత్నాలను రాసులుగా పోసి అమ్మేవారు. విజయనగర రాజుల చేతిలో అటువంటి వైభవాన్ని పొందింది ఈ చంద్రగిరి కోట.

విజయనగరం రాజులు ఈ కోటను శత్రువులనుండి కాపాడటానికి ఎంతో  వ్యూహాత్మకంగా  అప్పటి రాజులు చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్మించారు. ముఖ్యంగా కొండ పాదభాగంలో ఈ కోటను నిర్మించడం వల్ల సహజసిద్ధంగా శత్రురాజులనుచి రక్షింపబడుతుంది. అంతేకాకుండా ఈకోట కొండకు దగ్గరగా ఉండటం వల్ల కొండపై  నుంచి శత్రువుల కదలికలను చాలా సులభంగా గుర్తించవచ్చు.
ఈ కోట చుట్టూ దాదాపు 2 కి.మీ  వరకు దృఢమైన ప్రహరీ గోడ ఉంది.  దీని కోసం పెద్ద పరిమాణంలో వుండే రాళ్లను వినియోగించారు. అంత  పెద్ద రాళ్లను ఆకాలంలో ఎలా నిర్మించారు అన్నది ఇప్పటికి అంతుచిక్కని రహస్యం. ఇక ఈ కోట గోడను అనుసరిస్తూ కందకం ఉంది. ఈ కందకంలో మొసళ్లను వదిలేవారు.
శ్రీకృష్ణదేవరాయలు తిరుమలను సందర్శించడానికి వచ్చినపుడు ఇక్కడే  విడిది చేసేవారు. క్రీ.శ 1585 లో విజయనగర సామ్రాజ్యం హిందూ ముస్లిం గొడవల కారణంగా పతనమైనందున విజయనగర రాజులు తమ రాజ్యాన్ని కొన్నేళ్ల పాటు పెనుగొండకు మార్చారు. పెనుగొండ తరువాత కొన్ని సంవత్సరాల తరువాత  మళ్ళీ  చంద్రగిరికి  మారిపోయింది.  చంద్రగిరినుండి పాలించిన చిట్టచివరి రాజు పెదవెంకటరాయులు. 
కొండపైన  ఒక సైనిక స్థావరాన్ని నిర్మించారు. వాళ్ళ అవసరాలు తీర్చడానికి కొండ పైన రెండు చెరువులను నిర్మించి కిందనున్న పెద్ద చెరువు నుండి నీటిని పంపేవారని కోట మ్యూజియంలోని సమాచారం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఐతే  ఆకొండమీదికి నీటిని ఎలా పంపించారు అన్నది ఇప్పటికి పెద్ద  మిస్టరీగానే ఉండిపోయింది.

 

రాజుమహల్

 

రాణిమహల్
చంద్రగిరి కోటలో చూడదగిన ప్రదేశాలు రాజు మహల్ మరియు రాణి మహల్.  రాణి మహల్ రెండు అంతస్తులు కలిగి ఉంటె రాజు మహల్ మూడు అంతస్తులను కలిగి ఉంటుంది. రాణి మహల్ నిర్మాణాన్ని పరిశీలించి అది ఒకప్పుడు గుర్రపుశాల అని పురాతత్వ శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఇందుకు ఆధారాలు  కూడా మనకు అక్కడ కనిపిస్తాయి.
పూర్తిగా శిథిలావస్థకు  చేరుకున్న అప్పటి దేవాలయాలు
కోట చుట్టూ అప్పటి దేవాలయాలు  చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని పాడైన దేవాలయాలను వదిలేసి రాణి మహల్ మరియి రాజు మహల్ ను, వీటి వెనుక ఉన్న చెరువును పర్యాటకులు సందర్శించడానికి వీలుగా  అభివృద్ధి చేస్తున్నారు.
చంద్రగిరికోట వెనుకభాగంలోని  ప్రదేశంలో లైటింగ్ షో నిర్వహించి శబ్దాల ద్వారా అప్పటి విజయనగర రాజుల పాలనలోని చంద్రగిరి మహత్యాన్ని వివరించేవారు. ప్రస్తుతం ఇటువంటి లేసర్ ప్రదర్శన నిలిపివేశామని అక్కడి మ్యూజియం వారు చెప్తున్నారు.

చంద్రగిరి కోట గురించి మనం తెలుసుకోవలసిన మరికొన్ని విషయాలు

  1. చంద్రగిరి వైభవాన్ని తెలిపే శాసనాలన్నీ చంద్రగిరి కోట మ్యూజియం లో మొదటి అంతస్తులో చూడవచ్చు.
  2. చంద్రగిరి కోట నిర్మాణంలో ఎక్కడ కూడా కలప వినియోగించక పోవడం ఈ కోట యొక్క ప్రత్యేకతగా చెప్పవచ్చు. దీని నిర్మాణంలో సున్నం, ఇసుక, పెద్ద రాళ్లను మాత్రమే వినియోగించారు.
  3. చంద్రగిరిలో 1640లో ఈ కోట కట్టబడింది.
  4. కోట చుట్టూ దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు చాలా దృఢమైన గోడలు ఉన్నాయి.  ఈ గోడలు కట్టడానికి వినియోగించిన రాళ్ళ పరిమాణం చాలా పెద్దవిగా ఉంటాయి. పూర్వకాలంలో వీటిని ఏనుగుల సహాయంతో నిర్మించారు.
  5. అచ్యుత దేవరాయలను ఈ కోటలోనే గృహ నిర్బంధంలో ఉంచారు.
  6. రాజమహలుకు వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో పెద్ద ఓపెన్ థియేటర్ ఏర్పాటుచేశారు. ఈ ప్రదర్శన ద్వారా పెనుగొండ, చంద్రగిరి సంస్థానాలు ఎలా నాశనమయ్యాయో కళ్ళకు కట్టినట్లు కాంతి, శబ్దాల ద్వారా వివరిస్తారు. ఈ ప్రదర్శన తెలుగు మరియు ఆంగ్ల భాషలో ఉంటుంది. ఆంగ్ల భాషలో వాఖ్యానము అమితాబచ్చన్ స్వరంలో వినవచ్చు.
  7. విజయనగర సామ్రాజ్యం యొక్క వ రాజధాని చంద్రగిరి, గోల్కొండ సుల్తాన్లు పెనుగొండపై దాడి చేసినప్పుడు రాయల వారు తమ రాజధానిని ఇక్కడికి మార్చారు.
  8. శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానంలో గల మహామంత్రి తిమ్మరుసు జన్మస్థలం చంద్రగిరి.
  9. ఇది ఒక చారిత్రిక కోట, 11  శతాబ్దంలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి దగ్గరలో చంద్రగిరిలో నిర్మించబడింది.
  10. చంద్రగిరి కోటను చూడాలనుకునేవారు మొదటగా తిరుపతికి చేరుకోవాలి. అక్కడినుండి 12 కి.మీ బస్సు లేదా ఆటోలో ప్రయాణంచేస్తే చంద్రగిరి చేరుకోవచ్చు.

చంద్రగిరికోట దగ్గరలోని దేవాలయాలు

  • మూలస్తానమ్మ తల్లి దేవాలయం.
  • మిట్ట గంగమ్మ తల్లి దేవాలయం.
  • పంచపాండవులు, ద్రౌపతీదేవి దేవాలయం.
  • స్వర్ణముఖీ నది ఒడ్డున ఉన్న పాడుబడిన దేవాలయాలు.
  • తొండవాడకు వెళ్లే మార్గంలో ఎడమవైపున పొలాల్లో  పురావస్తు వేత్తలు భద్రపరచిన పాడుబడ్డ దేవాలయం.
  • నర్సింగాపురం మరియు శ్రీనివాసమంగాపురం దారిలోని శివాలయం.
  • చంద్రగిరి సెంటర్ లో నమాజ్ టైంలో పెద్ద అలారం గల స్తంభం.
తెలుగుడిస్కవరీ.కామ్  ద్వారా ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్  ఉంటుంది అక్కడ మీ అభిప్రాయం తెలియచేయండి. 
Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *