అండమాన్ జైలు రహస్యాలు – Andaman secrets

అండమాన్ జైలు రహస్యాలు – Andaman secrets

 

అండమాన్ జైలు పేరు వింటేనే అందరికీ గుండెల్లో దడ పుడుతుంది. బ్రిటిష్ వారు పరిపాలించే కాలంలో ఈ జైలు అతి భయంకరమైన జైలు గా పేరుగాంచింది.  ఈ అండమాన్ జైలులోనే  దేశ స్వాతంత్ర సమర వీరులను అత్యంత క్రూరంగా శిక్షను విధించారు. ఇక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి రోజు వందల్లో శిక్ష పడిన ఖైదీలు చనిపోయేవారు.  ఇటువంటి భయంకరమైన జైలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  • బంగాళాఖాతం సముద్ర జలాల మీద తేలుతున్నట్లు ఉండే రెండు దీప సముదాయాలే అండమాన్ నికోబార్ దీవులు.
  • 8,073 మూడు కిలోమీటర్లు విస్తరించి ఉండే ఈ భూభాగంలో అండమానుకు పోర్ట్ బ్లెయిర్ రాజధానిగా ఉంది.
  • అండమాన్ నికోబార్ లో  jarawas అనే  ఆదివాసులు మాత్రమే నివాసం ఉండేవారు. తరువాత ఈ దీవులు కొంతమంది చక్రవర్తుల చొరవతో ప్రపంచానికి తెలిసింది.
  • చోళులు, మరాఠీలు, ఆంగ్లేయులు ఈ దీవులను తమ ప్రయాణం కోసం అలాగే తమ అవసరాలు తీర్చుకోవడం కోసం ఉపయోగించుకున్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళు మాత్రం సామాన్య ప్రజలకు దూరంగా ఖైదీలకు శిక్ష వేయడానికి ఈ దీవులను ఉపయోగించుకున్నారు. 
  • బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధులను మరియు ఉద్యమకారులను ఈ అండమాన్ జైలులో ఖైదీలు గా నిర్బంధించారు. కొంతమంది ఖైదీలు గా ఉన్నవారు సముద్రంలో ఈదుకుంటూ వచ్చే సాహసం చేసేవారు. దీని కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ సెల్యులార్ జైలు ను నిర్మించింది. ఈ సెల్యులర్ జైలు లోపల చుట్టూ చీకటి గదులు ఉంటాయి. దీనివల్ల ఇక్కడ ఖైదీలుగా బంధింపబడిన వారు తుది శ్వాస విడిచే వరకు నరకం అనుభవించి చనిపోతారు.
  • అండమాన్ చుట్టూ సముద్రం మధ్యలో చిన్న చిన్న ద్వీపాలు  భయంకరమైన అడవులు ఉంటాయి. ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉండే ఈ దీవి భయంకరమైన కారాగార కేంద్రం గా నిర్మించబడింది.
  • ఖైదీలు ఎవరైనా సాహసం అం చేసి సముద్రంలో దూకి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ సముద్రంలో ఈదలేక చనిపోతారు. ఒకవేళ సముద్రం ఒడ్డుకు చేరుకున్న కూడా అక్కడ ఉండే భయంకరమైన విష సర్పాలు, జంతువుల చేతిలో చనిపోతారు.
  • ఖైదీలు ఇలా తప్పించుకు పోవడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఇకనుంచి ఎవ్వరు తప్పించుకోవడానికి వీలులేకుండా చీకటి గది తో కూడిన ఒక భయంకరమైన చీకటి గదులు నిర్మించింది. ఒక్కో గదిలో ఒక్కొక్క ఖైదీ మాత్రమే ఉంటాడు. ఏ ఒక్క ఒక ఖైదీ కూడా మరో గదిలో ఉండే ఖైదీ తో మాట్లాడడానికి వీలు లేకుండా ఈ జైలు గదులను చాలా చిన్నవిగా నిర్మించారు.
  • అండమాన్ దీవుల్లో చీకటి గదులు తో కూడిన ఈ సెల్యులార్ జైలు 1896 సంవత్సరంలో మొదలు పెట్టి  1996 సంవత్సరంలో నిర్మాణం పూర్తయింది.
  • బర్మా నుండి తెప్పించిన ముదురు ఎరుపు రంగు మరియు ఊదా రంగు ఇటుకలను తెప్పించి జైలు ను నిర్మించారు. దీని కారణంగా ఈ జైలు నిర్మాణం నిర్మాణం చాలా భయంకరంగా కనిపిస్తుంది.
  • ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మాత్రమే జైలులో ఉన్న చీకటి గదులు తలుపులు తెరవబ డేవి. ఏడు గంటలకి జైలు ఆవరణలో ఉన్న ప్రదేశానికి ఖైదీలు చేరుకునేవారు. గుట్టలుగుట్టలుగా వచ్చిన కొబ్బరిపీచు తీసుకొని ని తాళ్లను తయారుచేసే పని అక్కడికి వచ్చిన కొత్త ఖైదీలతో చేయించేవారు. కొంతమంది ఖైదీలతో ఎద్దుల ఉపయోగించి చేసే నూనె తయారీ వంటి పనులను కూడా ఖైదీలతో చేపించేవారు. వాళ్ల చేతులకు దెబ్బలు తగిలిన బొబ్బలు వచ్చిన కూడా మరుసటి రోజు పని చేయవలసి వచ్చేది. ఇటువంటి భయంకరమైన నరకాన్ని ఆ రోజుల్లో ఖైదీలు అనుభవించారు.
  • భారత దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత ఈ జైలులో ఉండే రెండు భాగాలు పూర్తిగా కూల్చివేశారు. సెల్యులార్ జైలు ఆవరణలో 1963లో ఒక వైద్యశాల కట్టించారు. ప్రస్తుతం ఇక్కడ 40కిపైగా డాక్టర్లు వైద్య సేవలను అందిస్తున్నారు.
  • 2006 సంవత్సరం నాటికి ఈ అందమైన జైలు నిర్మించి వంద సంవత్సరాలు పూర్తయింది.
అండమాన్ జైలు

అండమాన్ నికోబార్ దీవి

విదేశీపాలనలో భయంకరమైన జైలుగా నిర్మించి, అతి భయంకరమైన శిక్షలుు అమలు చేసిన ఈ ప్రదేశం ప్రస్తుతం పర్యాాటక కేంద్రంగా ఉంది. ఇక్కడ చేరుకునే వారికి వీసా అవసరం కూడా ఉండదు. కానీ ఇప్పటికీ  ఈ దీవుల్లో బయట ప్రపంచంతో సంబంధం లేకుండా  జారవా ఆదివాసులు నివసిస్తూ ఉన్నారు.

మనకు తెలియకుండా ప్రపంచంలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి మీకు గనక ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే తెలుగు telugudiscovery.com అనుసరించండి.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *