హిమాలయాల ప్రాముఖ్యత తెలుసుకుందాం – The importance of the Himalayas

హిమాలయాల ప్రాముఖ్యత తెలుసుకుందాం – The importance of the Himalayas

Himalaya Range
  • హిమాలయాలు అంటే సంస్కృతంలో మంచుకు నిలవు అనే అర్థం  వస్తుంది.  
  • ఈ పర్వత శ్రేణులు  ప్రపంచంలోనే ఎత్తైనవి. వీటిలో ఎవరెస్టు మరియు కాంచనగంగా శిఖరాలు  అత్యంత ఎత్తైనవి. 
  • సుమారు వందకు పైగా శిఖరాలు 7,200 మీటర్ల ఎత్తుకు మించి ఉంటాయి. 
  • ఈ హిమాలయాలు ఆసియాలోని (భూటాన్,చైనా,భారతదేశం,నేపాల్,పాకిస్తాన్) 5 దేశాల్లో వ్యాపించి ఉన్నాయి. 
  • ప్రపంచంలోని అతిపెద్ద నదులలో సింధు,గంగా,బ్రహ్మపుత్ర వంటి నదులకు ఈ హిమాలయాలే  వనరులు. 
  • హిమాలయాల పరివాహక ప్రాంతంలో 1.3 బిలియన్ల జనాభా నివసిస్తున్నారు. 
  • ఇవి చంద్రవంక ఆకారంలో 2,400 కి మీ పొడవు మరియు 400 కిమీ వెడల్పుతో విస్తరించి ఉన్నాయి. 
  • హిమాలయాల్లో ఉండే ఎవరెస్టు శిఖరం 8,488 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన పర్వతంగా పేరును పొందింది. ఈ శిఖరం నేపాల్ మరియు టిబెట్ సరిహద్దుల్లో ఉంటుంది. అందుకే ఈ శిఖరాన్ని ఆకాశ నుదురుగా పేర్కొంటారు. 
  • హిమాలయాల్లో సమాంతరంగా ఉండే మూడు పర్వత శ్రేణులున్నాయి. ఉత్తరాన ‘ఉన్నత హిమాలయాలు’ లేదా ‘హిమాద్రి పర్వత’ శ్రేణి ఉంది. ఇది పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ హిమానీ నదులు కలవు. ఇవి జీవ నదులకు నీటిని అందిస్తున్నాయి. 
  • హిమాద్రికి దక్షిణాన ఉన్న పర్వతశ్రేణిని ‘నిమ్న హిమాలయాలు ‘అంటారు. వీటిని హిమాచల్ అని పిలుస్తారు. ఈ శ్రేణిలో పిర్ పంజాల్, మహాభారత శ్రేణులు కలవు. 
  • హిమాలయాలకు తూర్పు సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది. భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలను  పూర్వాంచల్ అంటారు. 
  • హిమాలయాల వల్ల భారత శీతోష్ణస్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది. ఇది భారత దేశ ఉత్తర సరిహద్దులో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలులు అడ్డుకుంటున్నాయి.  
  • హిమాలయాల నదులు జీవనదులు. గంగా,సింధు,బ్రహ్మపుత్ర నదులు వాటి ఉపనదులు వల్ల ఈ ప్రాంతం అత్యంత సారవంతమైన మృతికలు కలిగి ఆహార, నగదు పంటలు పండటానికి ఉపయోగకరంగా ఉంది. 
  • హిమాలయ పర్వతాలు జమ్మూకాశ్మీర్  నుండి అరుణాచల్ ప్రదేశ్ 2,400 కి,మీ పొడవున ఒక చాపవలె విస్తరించి ఉన్నాయి. అయితే హిమాలయాల వెడల్పు అనేది ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ లో 200 కి,మీ వెడల్పు, జమ్మూకాశ్మీర్ లో 500 కి,మీ వెడల్పు  ఉన్నాయి. 
  • హిమాలయాలు మొత్తం 5 లక్షల  చ.కి.మీ. విస్తరించి ఉన్నాయి.
  • హిమాలయాల్లో దొరికే వనమూలికలు చాలా శక్తివంతమైనవి. భారతదేశ ఆయుర్వేద మందుల పరిశ్రమలకు  మూలికలను అందించే  పెన్నిధిగా హిమాలయ ప్రాంతం పేరుగాంచింది. 
  • పూర్వకాలంలో శత్రుదేశాల నుండి భారతదేశం కాపాడుకోవడానికి హిమాలయాలు ప్రధాన కారణం అనిచెప్పవచ్చు. 

హిమాలయాల్లో సమాంతరంగా ఉండే మూడు పర్వత శ్రేణులున్నాయి:

  1. హిమాద్రి  (అత్యున్నత హిమాలయాలు)
  2. హిమాచల్  (నిమ్న హిమాలయాలు)
  3. శివాలిక్ శ్రేణి  (బాహ్య హిమాలయాలు)
  • తాజా పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు  139-140 లక్షల సంవత్సరాల క్రితమే హిమాలయాలు ఏర్పడ్డాయని కనుగొన్నారు. 
మనం నివసించే ఈ ప్రపంచంలో మానవునికి తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటి  గురించి తెలుసుకోవాలంటే telugudiscovery.com  అనుసరించండి.


Leave a Comment

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *