- క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ కరెన్సీ. కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్స్ ఉపయోగించి ఈ డిజిటల్ కరెన్సీని సంపాదించవచ్చు.
- క్రిప్టో కరెన్సీపై ఎవరి నియంత్రణ ఉండదు. డీసెంట్రలైజ్డ్ సిస్టం ద్వారా ఈ క్రిప్టో కరెన్సీ పనిచేస్తుంది.
- డీసెంట్రలైజ్డ్ అంటే అర్థం ఈ కరెన్సీ పై కేంద్ర ప్రభుత్వాలు , ఇతర కంపెనీలు గాని ఎటువంటి అధికారాన్ని చేలాయించలేవు.
- క్రిప్టో కరెన్సీ విలువ డిమాండ్, సరఫరా ఆధారంగా పనిచేస్తుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టోకరెన్సీలు పనిచేస్తాయి.
- ప్రపంచంలో మొట్టమొదటిగా బిట్ కాయిన్ అనే క్రిప్టో కరెన్సీని సతోషి నకమోటో అనే పేరుగల వ్యక్తి 2008 ఆక్టోబర్ లో కనుగొన్నాడు. ఒకవిధంగా చెప్పాలంటే బిట్ కాయిన్ అనేది ఇప్పుడు మనం వాడుతున్న అన్ని రకాల క్రిప్టో కరెన్సీలకు మూలం.
- ప్రపంచంలో బిట్ కాయిన్, ఇథీరియం, డాష్, లైట్ కాయిన్, రిపుల్ వంటివి ప్రముఖ క్రిప్టో కరెన్సీలుగా కొనసాగుతున్నాయి.
- క్రిప్టో కరెన్సీ పై 2018 లో భారత ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. తరువాత సుప్రీం కోర్ట్ ఈ నిషేధాన్ని తొలగించింది.
- ఈ కరెన్సీ ని ఆన్లైన్లో మైనింగ్ చేయడం ద్వారా సంపాదించవచ్చు.
- క్రిప్టో కరెన్సీని వివిధ రకాల వెబ్సైట్ల ద్వారా కూడా కొనుక్కొని దాచి పెట్టుకోవచ్చు. దీని విలువ పెరిగిన వెంటనే మన బ్యాంక్ ఖాతాలోకి డబ్బును తీసుకోవచ్చు.
- డిజిటల్ కరెన్సీలో మొదటిగా ఏర్పడిన బిట్ కాయిన్ 2010 వ సంవత్సరంలో 0.06 డాలర్లుగా ఉండేది అంటే అప్పటి భారత రూపాయితో పోలిస్తే ఒక రూపాయి కూడా ఉండదు. ప్రస్తుతం ఈ కాయిన్ విలువ 50 లక్షల రూపాయల పైనే ఉంది.
- క్రిప్టో కరెన్సీ రాబోయే కాలంలో ఎక్కువగా వినియోగించే అవకాశం ఉంది. దీనిని మనం కొనవచ్చ లేదా అనేది వ్యక్తిగత విషయం కాబట్టి మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు కొనుక్కోండి.
- ఇటువంటి కాయిన్స్ ఒకేసారి అమాంతం పెరగచ్చు లేదా అమాంతం తగ్గిపోవచ్చు. దీని విలువ డిమాండ్ మరియు సరఫరా ఆధారంగా ఉంటుంది.

Posted inBlog