బంగారం గురించి తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు – Important things to know about gold

బంగారం గురించి తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు – Important things to know about gold

  • బంగారం అనేది విలువైన లోహము, రసాయనిక మూలకము. ఆభరణాలలో, అలంకారాలలో  వీటిని ఎక్కువగా వాడుతుంటారు. 
  • స్వచ్ఛమైన బంగారం అనేది కొద్దిగా ఎరువు ఛాయ కలిగి, పసుపు పచ్చగా ఉండే సాంద్రత కలిగిన మెత్తని లోహము. 
  • పురాతత్వశాఖ శాస్త్రవేత్తలు 40,000 సంవత్సరాల క్రితం స్పానిష్ దేశంలో పాలియోలిథిక్  కాలానికి చెందిన మానవులు నివసించిన గుహలో  బంగారు ముక్కలను గుర్తించడం జరిగింది. 
  • కొందరి నిపుణుల అంచనా ప్రకారం బంగారం అనేది క్రీస్తు  పూర్వం  5000 సంవత్సరాల క్రితమే ఈజిప్టు లో వాడినట్లు  ఆధారాలున్నాయి. 
  • బంగారం పాదరసంలో కరుగుతుంది. ఇలా పాదరసంలో కరగటం వల్ల ఏర్పడిన మిశ్రమాన్ని అమాల్గమ్  అంటారు. 
  • బంగారానికి సాగే గుణం ఎక్కువగా ఉంటుంది. ఒక ఔన్స్ బంగారం నుండి 50 మైళ్ళ పొడవున్న తీగను తీయవచ్చు. 
  • బంగారం అనేది భూమి లోపల దొరుకుతుంది. ఇప్పటివరకు 165,000 టన్నులకు పైగా బంగారాన్ని భూమి నుండి వెలికి తీశారు. వీటిలో 50% బంగారాన్ని ఆభరణాలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. మిగతా బంగారాన్ని పారిశ్రామికంగా వినియోగిస్తున్నారు. 
  • ఎలక్ట్రానిక్ వస్తువుల్లో కూడా బంగారాన్ని ఎక్కువగా వాడుతుంటారు. దీన్ని కంప్యూటర్, ఎలక్ట్రానిక్ పరికరాల్లో కనెక్టర్లుగా ఉపయోగిస్తారు. 
  • ప్రపంచ బంగారు సమాఖ్య (World Gold Council) ప్రకారం ఒక సెల్ ఫోనులో 50 మీ.గ్రాముల బంగారం ఉపయోగించే అవకాశం ఉంది.  
  • బంగారానికి పరారుణ కిరణాలను ప్రతిబిబింప చేసే లక్షణం ఉన్న కారణంగా అంతరిక్ష ప్రయాణికులు, వ్యోమగాములు ధరించే దుస్తుల తయారీలో వాడుతారు. 
  • కొన్ని రకాల ఆహార పదార్తాల్లో కూడా E175 అనే బంగారాన్ని ఉపయోగిస్తారు. 
  • ప్రపంచంలో ఎక్కువ బంగారాన్ని కొనే దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. 
  • 1925 లో ఒక గ్రాము బంగారం ధర 18 రూపాయలు ఉండేది. కానీ ప్రస్తుతం బంగారపు ధర 50 వేల రూపాయలకు పైగా చేరుకుంది.
  • ఒలంపిక్స్ జరిగే తోలి రోజుల్లో పూర్తిగా బంగారంతో కూడిన మెడల్స్ ఇచ్చేవారు. ఇలా చేయడం వలన అధిక బంగారం ఖర్చు కావడంతో, ఇప్పటి ఒలంపిక్స్ పథకాలలో కేవలం 1.34% బంగారాన్ని మాత్రమే వినియోగిస్తున్నారు. 
  • పూర్వ కాలంలో మనదేశంలోని శ్రీమంతులు వేడి,వేడి అన్నంలో చిన్న బంగారపు ముక్కను కలుపుకొని తినేవారు. ఇలా తినడం వల్ల ఆయుష్షు పెరిగి అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని వారు నమ్ముతారు. ఇది నిజం  కూడా. ఇప్పుడున్న పరిస్థితులలో ఒంటి మీద వేసుకోవడానికి కూడా బంగారాన్ని కొనలేక పోతున్నాం. ఇక తినడం అనేది అసాధ్యం. 
  • మానవుని శరీరంలో కూడా 0.2 మి,గ్రా బంగారం ఉంటుంది. ఇది ఎక్కువగా రక్తంలో ఉంటుంది. 
  • సముద్రంలో కూడా సుమారు 20 మిలియన్ టన్నుల బంగారం ఉంది. దీనిని ప్రపంచంలోని ప్రజలందరికి పంచినట్లైతే ప్రతి ఒక్కరికి సుమారు 4 కేజీల బంగారం వస్తుంది.  
  • బంగారాన్ని కరిగించి ద్రవరూపంలో ఇంజక్షన్ ద్వారా మన శరీరంలో ఎక్కించినట్లైతే కాన్సర్ ను నిరోధించడానికి ఒక కారకంగా ఉపయోగపడుతుంది. 


విశ్వంలో మనకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాలంటే మా తెలుగుడిస్కవరీ.కామ్ అనుసరించండి. 

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *