Talakona Waterfalls in Telugu

Talakona Waterfalls in Telugu

తలకోన జలపాతం ౼ విశేషాలు

Talakona waterfalls

భారతదేశంలో ఉన్న ఎన్నో అందమైన ప్రదేశాల్లో తలకోన జలపాతం ఒకటి. దట్టమైన అరణ్యంలో చుట్టూ  కొండల మధ్య  ఈ జలపాతం ఉంటుంది. 

చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుపతికి 58 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది.

తలకొన అనే పేరు ఎలా వచ్చింది

 పూర్వ కాలంలో కుబేరుని అప్పు తీర్చేందుకు శ్రీనివాసుడు ధనాన్ని కొలుస్తూ అక్కడే నిద్రపోయేవాడని చెపుతారు. అలా పడుకునే సమయంలో ఆయన తల భాగం కొండకు ఆనించి పడుకుకునేవారని అందుకే దీనికి తలకోన అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెపుతోంది. ఈ జలపాతాన్ని శిరోద్రోణం అనికూడా పిలుస్తారు. ఎంతో రమణీయంగా కనువిందు చేసే జలపాతం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో యెత్తైన జలపాతంగా పెరు గాంచింది. నిత్యం పర్యాటకులతో కల కల లాడే ఈ తలకోన ప్రాంతంలో మరెన్నో మనకు తెలియని అందాలు దాగి ఉన్నాయి. 
తలకోన ప్రాంతం నుంచి కొండ అంచుల్లో దట్టమైన అడవి గుండా దాదాపు రెండు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే  తలకోన జలపాతం చేరుకోవచ్చు. ఈ జలపాతంం చుట్టూ దట్టమైన అడవి, ఎత్తయిన కొండలు ఉంటాయి. ప్రకృతి మధ్య ఉన్న ఈ జలపాతం చూడడానికి చాలా అందంగా ఉంటుంది.
60 మీటర్ల ఎత్తునుండి ఈ జలపాతం జాలువారుతుంది.

తలకోన ప్రాంతంలో ఉన్న మరికొన్ని ప్రదేశాలు

తలకొన ప్రదేశంలో ఉన్న శివాలయం : 

తలకోన జలపాతం ఉన్న ప్రాంతంలోనే శివాలయం ఉంది. ఇక్కడ ఉన్న శివుడు సిద్దేశ్వరుని రూపాన కొలువై ఉన్నదని ఇక్కడివారు నమ్ముతారు. ఈ ఆలయాన్ని 1811 సంవత్సరం లో అప్పాస్వామి అనే భక్తుడు కట్టించడాని స్థానికులు చెపుతారు.

నెలకోన అనబడే ప్రదేశం :  

ఆలయానికి అతిసమీపంలోనే దట్టమైన కొండల మధ్య ఒక వాగు ప్రవహిస్తుంటుంది.  ఇందులో ప్రవహించే నీరు చాలా చల్లగా మరియు స్వచ్ఛంగా ఉంటాయి. ఇక్కడ రెండు కొండల నడుమ ఒక నీటి ప్రవాహం వచ్చి ఒక కొలనులో దూకుతూ ఉంటుంది. ఈ నీరు మనకు కనబడనంత ఎత్తు నుంచి జాలు వారుతుంది. ఈ ప్రదేశంలో అనేక ఔషధ లక్షణాలున్న మొక్కలను మనం గుర్తించవచ్చు.
 

తలకోన గురించి మరి కొన్ని ముఖ్య  విషయాలు 

తలకోనలో ఉన్న వృక్ష సంపద :  

  • ఈ ప్రాంతంలో ఉన్న  దట్టమైన అడవులలో  పెరిగే వృక్ష సంపద, అనేక వనమూలికలకు పుట్టినిల్లు. ఈ అడవుల్లోని  వృక్షాలు  వృక్షాలు చాలా ఎత్తుగా ఉంటాయి. సూర్యరశ్మి నేలమీద పడనంత దట్టమైన అడవి కావడంతో ఇక్కడి వృక్షాలు సూర్యరశ్మిని అందుకోవడానికి పైపైకి పెరుగుతాయి. ఎక్కువగా ఎర్ర చందనం వంటి ఈ ప్రాంతంలోనే పెరుగుతాయి. అడవిలో ప్రధానంగా అడవి కోళ్లు, నెమళ్ళు, ఎలుగుబంట్లు, దేవంగు పిల్లి, దుప్పులు, ఎలుగుబంట్లు, ఏనుగులు మొదలైన జంతువులు కూడా ఉంటాయి.
  • తలకోన జలపాతం పై నుండి కొంత దూరంలో పాపనాసం అనే తీర్థం ఉంది. ఇక్కడ గిల్లి తీగ అనే తీగ ఉంది. ఈ తీగలు కొన్ని కిలోమీటర్ల పొడవు ఉంటాయి. వీటి కాయలు  చింతకాయలు లాగా ఉండి వాటికంటే పొడవుగా పెరుగుతాయి. ఈ తీగలను, వాటి కాయలను మరియు వాటి గింజలను మందులుగా వాడుతారు. 
  • తలకోన వాటర్ ఫాల్స్ వెళ్లే దారిలో రామ,లక్ష్మణుల మామిడి చెట్లు ఉన్నాయి. ఒకే పొడవుతో ఉన్న ఈ వృక్షాలను భక్తులు రామ,లక్ష్మణ వృక్షాలు అని పిలుస్తారు. వారు ఈ పర్వతాలపై తిరగడానికి గుర్తుగా ఈ వృక్షాలు ఉన్నట్లు అక్కడి వచ్చే భక్తుల నమ్మకం.

  • తలకోనలో టీటీడీ ఆధ్వర్యంలో రెండు అతిధి గృహాలు ఉన్నాయి. ఇందులో 12 గదులు ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్ కోసం ఫోన్ చేసి రిజెర్వేషన్ చేసుకోవచ్చు. అలాగే శాకాహార, మాంసాహార భోజన సౌకర్యాన్ని అటవీశాఖ అందిస్తుంది.
తలకోన ఎలా వెళ్లాలో తెలుసుకుందాం 
తలకోనకు తిరుపతి నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు.తిరుపతి నుండి 49 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తలకోన చేరుకోవచ్చు. తిరుపతి బస్టాండ్ నుంచి రోజు ఉదయం 7 గంటలకు నేరుగా తలకొనకు బుస్సు సౌకర్యం ఉంది. సాయంత్రం 4:30 తర్వాత జలపాతం చూడటానికి అనుమతి ఉండదు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *