తిరుమల చేరడానికి 8 అడవి మార్గాలు ఉన్నాయి – 8 Ways to reach Tirumala

తిరుమల చేరడానికి 8 అడవి మార్గాలు ఉన్నాయి – 8 Ways to reach Tirumala

There are 8 wild ways to reach Thirumala

తిరుమల శ్రీవారి దర్శనానినికి  కాలినడకన మార్గాలు 8 మార్గాలు ఉన్నాయి. సాధారణంగా భక్తులకు తెలిసింది రెండు మార్గాలు మాత్రమే మిగతా ఆరు మార్గాలు ఎవ్వరికీ తెలియవు. తాళ్ల పాక అన్నమాచార్యులు తిరుమలకి నడిచి వెళ్లిన దారి గురించి మరియు ఇతర మార్గాలను తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మా పూర్తి కథనాన్ని చదవండి. 

తిరుల చేరుకోవడానికి మనకు 8 కాలినడక మార్గాలున్నాయి 

1.  అలిపిరి మెట్లద్వారా తిరుమలకు చేరడం 


తిరుమలకి నడిచివెళ్లే భక్తులందరికీ తెలిసిన దారి అలిపిరి మెట్ల దారి. ఇక్కడి నుండి తిరుమలకి చేరుకోవడానికి 3,550 మెట్లు ఉంటాయి. ఏ మెట్లు ఎక్కడం ద్వారానే భక్తులు తిరుమలకి చేరుకుంటారు. భక్తులు ఈ మెట్ల ద్వారా దాదాపు 9 కీ.మీ నడుస్తారు. ఇటువంటి పవిత్రమైన అలిపిరి మెట్ల మార్గాన్ని 15 వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారు. 

2. శ్రీవారి మెట్ల దారి గుండా తిరుమల చేరడం 


తిరుపతి నుండి శ్రీనివాస మంగాపురానికి చేరుకోవాలి. ఇది దాదాపు 13 కీ మీ ఉంటుంది. అక్కడి నుండి కుడివైపు మార్గంలో 3 కీ మీ  ప్రయాణిస్తే శ్రీవారి మెట్ల మార్గానికి చేరుకోవచ్చు.  తిరుమల చేరుకోవడానికి  ఇక్కడ 2,388 మెట్లు ఉంటాయి. ఇక్కడి నుంచి కేవలం ఒక గంటలో తిరుమలకు చేరుకోవచ్చు. తిరుపతి బస్టాండ్ నుంచి ఉచిత బస్సు ప్రయాణం శ్రీవారి మెట్ల వరకు టీటీడీ వారు కల్పించారు. శ్రీవారి మెట్లకు చేరుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు ఈ బస్సును వినియోగించుకోవచ్చు. 

3. అన్నమయ్య కాలినడకన వచ్చిన  దారి గుండా తిరుమల చేరడం 


అన్నమయ్య కడప జిల్లాలోని తాళ్లపాక గ్రామంలో జన్మించారు. శ్రీవారికి  ప్రియ భక్తుడైన  అన్నమయ్య 15 వ  శతాబ్దంలో   ఈ మార్గంలో తిరుమలకు నడిచి వెళ్లారు.  దట్టమైన రాళ్లు రప్పలతో మామంటూరు అడవి మధ్యలో ఈ దారి ఉంటుంది. ఈ దారిలో అన్నయ్య నడచిన కారణంగా దీనిని అన్నమయ్య దారి అంటారు.  ఈ మార్గంలో విజయనగర రాజులు అప్పట్లో రాతి మెట్లను కట్టించారు. ఈ మార్గం ఏడు కొండలను తాకుతూ వెళ్తుంది. కానీ ఈ మార్గంలో నడవటానికి భక్తులకు అనుమతి లేదు .  ఇక్కడ టీటీడీ వారు చెట్లను పొదలను తొలగించి లైట్లను ఏర్పాటుచేసి పైపులైన్ల ద్వారా  త్రాగు నీటిని ఏర్పాటు చేశారు కాకపొతే ఈ మార్గం ద్వారా భక్తులను ఇంకా అనుమచించడం లేదు. 

4. కుక్కలదొడ్డి మార్గం ద్వారా తిరుమల చేరడం 

కడప జిల్లా బోర్డర్ దగ్గర చిత్తూరు జిల్లా ఎంట్రెన్స్ దగ్గర కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది.   అక్కడి నుండి రమణీయమైన ప్రకృతి  మధ్య భయంకర లోయలను దాటుకుంటూ వెళ్తే తుంబుర తీర్థానికి చేరుకోవచ్చు. తుంబుర తీర్థములో అడ్బతమైన గుహలను చూడవచ్చు.  అక్కడి నుంచి ఏడు కీ మీ  వెళితే పవిత్రమైన గోవిందుడు పాదాలను తాకుతూ ప్రవహించే పాపవినాశనానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి 5 కీ మీ నడిస్తే తిరుమలకి చేరుకోవచ్చు. 

5. అవిచారి కోన మార్గం ద్వారా తిరుమల చేరుకోవడం ఇది   రేణిగుంట  దగ్గరలో  ఉంది 

రేణిగుంట సమీపంలో ఉన్న ఆంజనేయపురం అనే గ్రామం నుంచి  ఈ దారి మొదలవుతుంది.  అక్కడ నుండి అవచారి కొనకు  చేరుకోవాలి . అక్కడి నుండి ఎత్తైన శిఖరాలను, భయంకర లోయలను దాటుకుంటూ  గంటా మండపాన్ని తాకుతూ వెళితే మోకాలి పర్వతానికి చేరుకోవచ్చు. అక్కడి నుచి తిరుమలకి వెళ్లే మార్గం అందరికి తెలుసు. 


6. ఏనుగుల దారి గుండా తిరుమలకి చేరుకోవడం 


చంద్రగిరి  శ్రీవారి మెట్టు నుంచి అవచారికోనకు ఒక మార్గం ఉండేది.  ఆ మార్గం నుండి పెద్ద పెద్ద రాతి స్తంభాలను ఏనుగుల ద్వారా తిరుమలకి తీసుకు వెళ్లేవారు. తిరుమలలో నిర్మించిన సుందరమైన మండపాలకు కావాల్సిన శిలలను, పనిముట్లను ఇక్కడినుంచే తీసుకువెళ్లేవారు. కానీ ఇక్కడి దారి పూర్తిగా మూసుకు పోయింది. ఏనుగులు నడచిన దారి కాబట్టి దీనిని ఏనుగుల దారి అంటారు. 

7. తలకోన అడవి ద్వారా తిరుమలకు చేరుకోవడం 

తలకోన ద్వారా తిరుమల చేరుకోవాలంటే చాలా పెద్ద సాహసం చేయవలసి ఉంటుంది. ఈ దారి గుండా ప్రయాణిస్తే ప్రకృతి చాలా అందంగా మరియు  భయంకరంగా కూడా ఉంటుంది. ఈ దారిలో విష సర్పాలు ,పులులు,ఏన్గుగులు మరియు ఇతర క్రూరమృగాలు ఉంటాయి. వీటిని దాటుకుంటూ వెళ్లడమంటే పెద్ద సాహసమే. తలకోన జలపాతం పై నుంచి 20 కీ మీ అడవిలో ప్రయాణిస్తే తిరుమలకు చేరుకోవచ్చు. 

8. కల్యాణి డ్యామ్ మార్గం  నుండి తిరుమలకి చేరుకోవడం 

కల్యాణి డ్యామ్ అనేది తిరుమల కొండకు పశ్చిమాన ఉంటుంది. పక్కనే ఉన్న శ్యామల కొండ  నుంచి 15 కీ మీ నడిస్తే నారాయణగిరి వస్తుంది. అక్కడి నుంచి తిరుమలకి చేరుకోవచ్చు. 
ఈ మొత్తం 8 మార్గాల్లో అలిపిరి మరియు శ్రీవారి మెట్టు ద్వారానే తిరుమలకు చేరడానికి మనకు అనుమతి ఉంటుంది. మిగిలిన 6 మార్గాలలో మనకు అనుమతి లేకుండా వెళ్లడం కుదరదు.  ఎందుకంటె  ఈ మార్గాలు చాలా ప్రమాదకరంగాను మరియ ఈ  అడవి  క్రూరమృగాలతో భయంకరంగా ఉంటుంది. 
Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *